తెలంగాణ

telangana

ETV Bharat / state

నెక్లెస్​ రోడ్డు మూసివేత: మంత్రి తలసాని - Hyderabad necklace Road Works Latest News

హైదరాబాద్ నెక్లస్ రోడ్​ను నెలరోజుల పాటు మూసేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మరమ్మతు పనులు ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి చేయాలంటే దారి మూసేయక తప్పదన్నారు.

నెలరోజుల పాటు నెక్లస్ రోడ్ మూసివేత: మంత్రి తలసాని
నెలరోజుల పాటు నెక్లస్ రోడ్ మూసివేత: మంత్రి తలసాని

By

Published : Jun 8, 2020, 4:38 PM IST

నెలరోజుల పాటు నెక్లస్ రోడ్ మూసివేత: మంత్రి తలసాని

రహదారి మరమ్మతుల కారణంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును నెలరోజులపాటు మూసేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రూ.26 కోట్ల వ్యయంతో చేపట్టిన నెక్లస్ రోడ్ మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలంటే ఇరువైపులా మూసేయక తప్పదన్నారు. సిబ్బంది సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

వీడీసీసీ పనుల పరిశీలన..

బుద్ద పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగా నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ పరిసరాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో నెక్లస్ రోడ్​లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్, ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నెక్లస్ రోడ్​లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు.

ఇవీ చూడండి : అవినీతి సొమ్మేనా?.. అ.ని.శా. విచారణకు సుజాత

ABOUT THE AUTHOR

...view details