తెలంగాణ

telangana

ETV Bharat / state

నీట మునిగిన కాలనీలు.. రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు​ - హైదరాబాద్​ తాజా వార్తలు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర వాసులు వరదల్లో చిక్కుకుపోయారు. హైదరాబాద్​లోని బడంగ్​పేటలో దాదాపుగా అన్ని కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

ndrf rescue operation for flood effected people in badangpet hyderabad
నీట మునిగిన పలు కాలనీలు.. రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్​

By

Published : Oct 14, 2020, 7:23 PM IST

భారీ వర్షాల కారంణంగా మూసీనదికి వరద పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. బడంగ్​పేటలో దాదాపు అన్ని కాలనీలు నీట మునగడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బోట్ల సాయంతో కాలనీల్లో తిరుగుతూ ఇళ్లలోనే ఉండి పోయిన వారిని రక్షించారు. ఇప్పటి వరకు 74 మందిని రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా 100కి డయల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

నీట మునిగిన పలు కాలనీలు.. రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్​

ఇదీ చదవండి:నిండుకుండల్లా చెరువులు.. పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళ

ABOUT THE AUTHOR

...view details