ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే సహాయ చర్యలు చేపట్టామన్న ఆయన.. ఇళ్లలోకి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకే తమ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు స్పష్టం చేశారు.
'గ్యాస్ లీకైన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించాం' - vishakapatnam gas leakage latest news
ఏపీలోని విశాఖ ఘటనలో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటలకు గ్యాస్ లీక్ అయినట్లు వెల్లడించారు. దాదాపు 500 మందికిపైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
!['గ్యాస్ లీకైన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించాం' ndrf dg pradhan comments on gas leakage incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7098453-261-7098453-1588843458399.jpg)
'గ్యాస్ లీకైన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించాం'
దాదాపు 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు ప్రధాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు వెల్లడించారు. 200 మందికిపైగా వైద్య సహాయం పొందుతున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటలకు గ్యాస్ లీక్ జరిగినట్లు చెప్పారు.
ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!