తెలంగాణ

telangana

ETV Bharat / state

NDPS Act on Ganja Smuggling Gang : అరెస్ట్​లు చేసినా తగ్గేదేలే.. గంజాయి గ్యాంగ్​ కోసం రూట్ మార్చిన పోలీసులు - hyderabad latest news

NDPS Act on Marijuana Smuggling Gang : మాదకద్రవ్యాల నిర్మూలనకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇకపై కఠినంగా వ్యవహరించనుంది. పట్టుబడిన మాదకద్రవ్యాలతో పాటు నిందితుల ఆస్తులను జప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించగా వచ్చే డబ్బుతో నిందితులు భారీగా ఆస్తులు కూడబెడుతున్నారు. స్మగ్లర్లను దెబ్బతీయాలంటే ఎన్​డీపీఎస్​ చట్టం ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయడం ఒక్కటే మార్గమని యాంటీ నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది.

CP Anandh Warn to  Marijuana Smuggling gang
Marijuana Smuggling gang in Hyderabad

By

Published : Aug 18, 2023, 2:23 PM IST

CP Anandh Speech on Marijuana గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు

NDPS Act on Marijuana Smuggling Gang :ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో కిలో గంజాయి రూ.3 నుంచి రూ.5వేల వరకు ఉంటుంది. అదే సరుకును హైదరాబాద్‌లో రూ.20 నుంచి రూ.30వేల వరకు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ నుంచి సరిహద్దు మార్గాల మీదుగా హైదరాబాద్, ముంబయి, బెంగళూర్ తరలిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్న ముఠాలు.. వచ్చిన సొమ్ముతో ఆస్తులను కూడబెడుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా.. డబ్బులు ఖర్చు చేసి బెయిల్‌పై బయటికి వస్తూ.. యథావిధిగా దందా కొనసాగిస్తున్నారు.

Ganja Smuggling in Hyderabad : పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. ఇదివరకు లారీలు, వ్యాన్లలో క్వింటాళ్ల కొద్దీ గంజాయి తీసుకొచ్చేవాళ్లు. కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల కింద సరుకును ఉంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించేవారు. ఈ తరహా రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. దీంతో చిన్న పరిమాణంలో గంజాయి సరఫరా చేస్తున్నారు. కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఇందుకోసం కార్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు(Separate Arrangements in Cars) చేసుకుంటున్నారు.

Ganjaa Smugling in Telangana : గంజాయి రవాణా చేస్తున్న ముఠాల అరెస్ట్​.. 400 కిలోలు స్వాధీనం

Marijuana Smuggling in Telangana : తాజాగా.. మహబూబాబాద్‌కు చెందిన వీరన్నను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అతని నుంచి పలు విషయాలు రాబట్టారు. వీరన్న తన వాహనంలో సైరన్ ఏర్పాటు చేసుకొని చెక్‌పోస్టుల వద్ద సైరన్ మోగించి, హడావుడి చేసి బయటపడుతున్నట్లు గుర్తించారు. పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందనే విషయాన్ని తన స్నేహితులైన ఇద్దరు కానిస్టేబుళ్ల ద్వారా తెలుసుకున్న వీరన్న.. ఖరీదైన వాహనాల్లో వచ్చి అలా హడావుడి చేస్తూ తనిఖీలను తప్పించుకునేవాడు.

ఆంధ్రా -ఒడిశా సరిహద్దులో గంజాయి కొనుగోలు చేసి.. అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకురావడానికి పలు వాహనాలు మార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు అనుమానం రాకుండా ఫార్చునర్ లాంటి ఖరీదైన వాహనాలు వినియోగించినట్లు తేల్చారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి.. హైదరాబాద్, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించగా.. వచ్చిన సొమ్ముతో ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సొమ్ముతో మహబూబాబాద్​లో వైన్స్‌, సూపర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

Drugs Parcel Cyber Crime : 'నీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చింది.. నేనడిగినంత డబ్బివ్వకపోతే జైలుకు పంపుతా'

"గంజాయిని చిన్న చిన్న మొత్తంలో చేసుకుని రవాణా చేస్తున్నారు. ఈ ముఠా సులభంగా డబ్బులు సంపాదించేలనే ఉద్ధేశంతో ఈ పని చేస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు పెద్ద నెట్​వర్క్​ను ఏర్పాటు చేశాం. ఎన్​డీపీఎస్​ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు." -సీవీ ఆనంద్, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌

CP Anand Warn to Marijuana Smuggling Gang : సులభంగా డబ్బులు సంపాదించేందుకు అలవాటుపడుతున్న నిందితులు.. పోలీసులు కేసులను లెక్కచేయకుండా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో తరచూ దొరికిపోతున్న నిందితులపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగిస్తున్నారు . అవసరాన్ని బట్టి ఆస్తుల జప్తు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించగా వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను అధికారులు జప్తు చేయనున్నారు.

మహబూబాబాద్‌కు చెందిన వీరన్న ఐదేళ్ల వ్యవధిలో గంజాయి విక్రయం ద్వారా కోట్లు గడించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఖరీదైన 4 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టులో ప్రవేశపెట్టి వేలం వేయనున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది ఎన్​డీపీఎస్​ చట్టం కింద 1,176 కేసులు నమోదు చేసి 2,600 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో 205 మందిపై పీడీ చట్టం(PD Act) ప్రయోగించారు. ఆస్తుల జప్తు అస్త్రాన్ని ప్రయోగిస్తే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరా తగొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Drugs Seized in Hyderabad : హైదరాబాద్​లో రెండు వేేర్వేరు ఘటనల్లో.. రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

Ganja supply gang arrest in Hyderabad : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా.. ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details