నయీం అనుచరులమంటూ బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఎల్బీనగర్కు చెందిన దంపతులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఎల్బీనగర్కు చెందిన గుండు గీత అబ్దుల్లాపూర్ మెట్లోని గిల్లాపూర్లో 2017లో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇటీవల లాజిస్టిక్ పార్కు ప్రకటన చేయడం వల్ల అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయని బాధితులు తెలిపారు.
నయీం అనుచరులమంటూ బెదిరింపు
గత నెల 23న తమ ఇంటి ప్రహరీని లింబగిరి స్వామి అనే వ్యక్తి కొందరితో వచ్చి కూల్చేశారని కమిషన్ దృష్టికి తెచ్చారు. అడిగితే నయీం అనుచరులమంటూ బెదిరిస్తున్నారని గీత హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. నిందితుల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు.
మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధిత మహిళ ఇదీ చూడండి : స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు