తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు - former telangana home minister passes away

కార్మిక నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో ముగిశాయి. నాయిని కుమారుడు దేవేందర్​ రెడ్డి ఆయన పార్ధివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Nayani Narsinghareddy's funeral ended in hyderabad
ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

By

Published : Oct 22, 2020, 3:50 PM IST

Updated : Oct 22, 2020, 6:08 PM IST

ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు

తెలంగాణ తొలి దశ ఉద్యమనేత, కార్మిక ఆత్మబంధువు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. తెలంగాణ ఉద్యమనేతలు, మంత్రులు, అభిమానులు, నేతల కన్నీటిపర్యంతాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలను నిర్వహించారు. నాయినికి గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి తుపాకీ పేల్చి జననేతకు నివాళులు అర్పించారు. అంతకుముందు... మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర... బంజారాహిల్స్ రోడ్ నంబరు 12, ఫిలింనగర్ మీదుగా సాగింది.

అంతిమయాత్రలో కార్మిక సంఘాల ప్రతినిధులు, మంత్రులు, తెరాస నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు కేకే, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి ,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నాయిని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కార్మిక నేత నుంచి హోంమంత్రి దాకా... నాయిని రాజకీయ చరిత్ర

Last Updated : Oct 22, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details