విశాఖలో విన్యాసాల్లో భాగంగా సముద్రంలో నావికదళ సిబ్బంది బంకర్ పేల్చారు. నేవీ డేలో చేతక్, సారస్ హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. డార్నియర్ విమానాల ప్రదర్శన, హాక్స్ విమానాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. నావికాదళ విన్యాసాల ముగింపు సమయంలో నేవీ బ్యాండ్ నిర్వరించారు. బాణసంచా వెలుగులతో విశాఖ సాగరతీరం ఆకర్షణీయంగా మారింది.
అబ్బుర పరిచిన నౌకాదళ విన్యాసాలు - విశాఖలో నేవీ డే న్యూస్
నేవీ డే సందర్భంగా నిర్వహించిన విన్యాసాల్లో నీటిలో సహాయచర్యలు, సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఆపరేషన్ల ప్రదర్శనను నావికదళ సిబ్బంది చేశారు. మరోవైపు క్లీన్ వైజాగ్ సందేశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.
navy