రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ సినీనటి, మహరాష్ట్ర అమరావతి లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్ - బాలివుడ్ తాజా వార్తలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ మొక్కలను నాటారు.
ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తను కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో తన నివాసంలో మొక్కలు నాటినట్లు నవనీత్ కౌర్ వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజలలో చైతన్యం తీసుకు వస్తుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోశ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి బృంద సభ్యులకు మద్దతుగా ఉంటామన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి బాధ్యతగా మొక్కలు నాటాలని... భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.