హైదరాబాద్లో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వనస్థలిపురం ప్రశాంత్ నగర్లోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో12వ వార్షికోత్సవంలో భాగంగా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వార్షికోత్సవాలు 25 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ భుజంగారెడ్డి తెలిపారు.
వనస్థలిపురం కనకదుర్గ ఆలయంలో వైభవోపేతంగా వార్షికోత్సవాలు - వనస్థలిపురం కనకదుర్గ ఆలయంలో నవరాత్రి వేడుకలు
వనస్థలిపురంలోని కనకదుర్గ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ వార్షికోత్సవంలో భాగంగా నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు లోబడే ఉత్సవాలు జరుపుతున్నామని ఆలయ నిర్వహకులు తెలిపారు.
వనస్థలిపురం కనకదుర్గ ఆలయంలో వైభవోపేతంగా వార్షికోత్సవాలు
కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. కొవిడ్, భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:'రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు'
Last Updated : Oct 23, 2020, 7:22 PM IST