హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆమెను బళ్లారి పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడి నుంచి హోస్పేట్ తీసుకెళ్లారు. బళ్లారిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన అనంతరం తిరిగి ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బంగారంపై పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ.. ఆశచూపిన నౌహీరా షేక్.... వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. నౌహీరాపై తెలుగు రాష్ట్రాలతో పాటు... కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు... హీరా గ్రూప్స్ అక్రమాలను గుర్తించారు. సీసీఎస్ కేసులో నౌహీరా షేక్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంచల్‌గూడ జైలుకు నౌహీరా షేక్
సంచలనం సృష్టించిన హీరా గ్రూప్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్‌ను బళ్లారిలో విచారణ అనంతరం ఈరోజు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నౌహీరా షేక్