తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈడీ ఆఫీస్​కు వచ్చిన హీరా గ్రూప్​ అధినేత.. ఆ పత్రాలు అందజేత - తెలంగాణ తాజా వార్తలు

Case against Heera Group: ఆస్తుల జప్తు విషయమై హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్.. హైదరాబాద్​లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవలే ఈడీ ఆ కంపెనీకి సంబంధించి ఆస్తులను జప్తు చేయగా.. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు రావడంతో వాటికి సంబంధించిన డాక్యూమెంట్లను ఆమె ఈడీకి సమర్పించారు.

Nauheera Sheikh
Nauheera Sheikh

By

Published : Dec 27, 2022, 2:54 PM IST

Case against Heera Group: మనీలాండరింగ్ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్​ అధినేత నౌహీరా షేక్​ ఈరోజు హైదరాబాద్​లోని ఈడీ ఆఫీస్​కు వచ్చారు. ఆస్తుల జప్తు విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో.. ఈడీకి ఆ పత్రాలు సమర్పించేందుకు ఆమె కార్యాలయానికి వచ్చారు. "ఇటీవలే ఈడీ తమ ఆస్తులు జప్తు చేసిందని.. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని" ఆమె తెలిపారు.

36 శాతం వడ్డీ ఇస్తామని ప్రజల నుంచి 5 వేల కోట్ల సేకరించి.. తిరిగి చెల్లించకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్​లో గతంలో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా డబ్బును విదేశాల్లో షెల్ కంపెనీలకు మళ్లించడంతో.. 2018లో మనీలాండరింగ్ కింద ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలు ఆస్తులను జప్తు చేసింది.

"ఇటీవల మా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. తీర్పు పత్రాలను ఈడీకి సమర్పించేందుకు వచ్చాను". -నౌహీరా షేక్‌, హీరా గ్రూప్‌ అధినేత

ఈడీ ఆఫీస్​కు వచ్చిన హీరా గ్రూప్​ అధినేత.. ఆ పత్రాలు అందజేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details