హైదరాబాద్ అబ్కారీ పోలీసులు వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ కారును అనుమానంతో సోదాలు చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని గుర్తించారు.
నల్లబెల్లం పట్టివేత... ముగ్గురి అరెస్ట్ - అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని గుర్తించారు.
నాటు సారా తయారీ ముడిపదార్థాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అబ్కారీ శాఖ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 330 కేజీల నల్ల బెల్లం, 80 కేజీల నవసారాని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా ముడిపదార్థాలు రవాణా.. ముగ్గురి అరెస్టు
మహబూబాబాద్‌కు చెందిన గణేష్, నాగేంద్రబాబుతోపాటు బేగంబజారుకు చెందిన రాంచంద్రనారాయణలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నాటుసారా తయారీ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి : కల్తీ మద్యం తాగి.. కోమాలోకి వెళ్లి..