National Women Commission Responded on Jawaharnagar Incident: ఈ నెల 5న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో మహిళను వివస్త్ర ను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని కోరింది. ఘటనపై వారం రోజుల్లోగా డీజీపీ అంజనీ కుమార్ నుంచి నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
Jawaharnagar Incident in Hyderabad Story : మద్యం మత్తులో జవహర్‌నగర్‌కి చెందిన పెద్ద మారయ్య అనే వ్యక్తి ఆదివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో అతని తల్లితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక యువతి ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన నిందితుడు యువతిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఏమి చెయ్యాలో తెలియని బాధితురాలు షాక్‌కి గురైయింది. దీంతో ఒక్కసారిగా తేరుకుని నిందితుడ్ని కోపంతో దూరంగా నెట్టేసింది. దీంతో విచక్షణ కోల్పోయిన నిందితుడు మరింతగా రెచ్చిపోయి.. యువతి బట్టలను చించేసి, వివస్త్రను చేసి.. ఆమెపై కృూరంగా ప్రవర్తించాడు. నిందితుడితో పాటు ఉన్న ఆమె తల్లి ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఘటన జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ఈ దారుణాన్ని గమనించి.. అడ్డుకునే ప్రయత్నం చేసింది.