యువతిని అత్యంత కిరాతంగా హత్యచేయడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. హత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ సభ్యుల బృందం సాయంత్రం భాగ్యనగరానికి చేరుకోనుంది. ప్రియాంక రెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో పాటు అధికారులను అడిగి పూర్తి వివరాలు సేకరించనుంది.
యువతి హత్యోదంతంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ - PRIYANKA REDDY MURDER ISSUE
అత్యంత కిరాతకంగా యువతి హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ విచారణ సంఘాన్ని నియమించింది.
![యువతి హత్యోదంతంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ nwc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5211573-1061-5211573-1575016532234.jpg)
యువతి హత్యోదంతంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
Last Updated : Nov 29, 2019, 3:25 PM IST
TAGGED:
PRIYANKA REDDY MURDER ISSUE