హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి డీజీపీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బందితో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్, వాల్మికీ జయంతి వేడుకలు - రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల వార్తలు హైదరాబాద్
హైదరాబాద్ డీజీపీ కార్యాలయం, బీఆర్కే భవన్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి డీజీపీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. బీఆర్క్ భవన్‌లో దేశ ఐక్యత, సమగ్రత, రక్షణకు పాటుపడతామని ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ప్రతిజ్ఞ చేయించారు.
ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్, వాల్మికీ జయంతి వేడుకలు
అలాగే బీఆర్కే భవన్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు నిర్వహించారు. దేశ ఐక్యత, సమగ్రత, రక్షణకు పాటుపడతామని ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస రాజ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ నివాళి