తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగుదేశం కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు - teachers day 2020

సికింద్రాబాద్ బోయిన్​పల్లి తెలుగుదేశం కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం మల్కాజిగిరి తెదేపా ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్ సావిత్రి భాయి పూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్​ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Breaking News

By

Published : Sep 5, 2020, 11:17 PM IST

సికింద్రాబాద్ బోయిన్​పల్లి తెలుగుదేశం కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో మంచి మార్గాన్ని చూపే గురువు ఉంటారని మల్కాజిగిరి తెదేపా ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్ అన్నారు. విద్యార్థులు, గురువులందరికీ రుణపడి ఉండాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా పాఠాలను బోధిస్తున్నారని కొనియాడారు.

ఆయన కృషి ఎంతో గొప్పది...

అనేక మంది ఉపాధ్యాయులు, గురువులు చూపిన మార్గం, క్రమశిక్షణ ఫలితంగానే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. బోధించే వృత్తిలో ఉంటూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చే ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అశోక్ యాదవ్, శ్రీరాములు యాదవ్, జైరాజ్ ముదిరాజ్, వెంకటేశ్, వెంకట్​నంద, యాదగిరి, హరి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో

ABOUT THE AUTHOR

...view details