తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్ర కళా వేదిక ఖతార్​లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక - ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుక

ఖతార్​లోని “ఆంధ్ర కళా వేదిక” ICC అశోకా హాల్‌లో "తెలుగింటి ఆటలు" కార్యక్రమం నిర్వహించారు. ఖతార్ “జాతీయ క్రీడా దినోత్సవం” సందర్భంగా ఈ వేడుక జరిగింది.

qatar national sports day celebrations
qatar national sports day celebrations

By

Published : Feb 11, 2022, 6:56 AM IST

ఖతార్ “జాతీయ క్రీడా దినోత్సవం” సందర్భంగా "తెలుగింటి ఆటలు" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఆంధ్ర కళా వేదిక” ICC అశోకా హాల్‌లో ఫిబ్రవరి 8న ఈ వేడుక జరిగింది. డిఫెన్స్ అటాచి ఎంబసీ ఆఫ్ ఇండియా, ISC కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ కెప్టెన్ మోహన్ అట్ల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యనిర్వాహక వర్గాన్ని ఆయన అభినందించారు.

qatar national sports day celebrations

ఈ కార్యక్రమానికి ఖతార్​లోని తెలుగు వారి నుంచి అపూర్వమైన స్పందన లభించిందని.. అందరిలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేసే మన స్వంత సాంప్రదాయ ఆటలతో ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహకరించిన దాతలు, స్వచ్ఛంద సేవకులు, ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ రజని సహా పలువురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, బహుమతి వోచర్లు అందజేశారు.

ఆంధ్ర కళా వేదిక ఖతార్​లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక

ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రెసిడెంట్ పీఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐఎస్‌సీ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ థామస్, ఐసీబీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ నాయర్, రజనీ మూర్తి, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ కేఎస్ ప్రసాద్ వంటి పలువురు ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖ సంఘాల నాయకులు మహేశ్​ గౌడ, దీపక్ శెట్టి, ఎల్ఎన్ ముస్తఫా, ఇతర తెలుగు సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గ బృంద సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారు.

ఇదీ చూడండి:కొన్నది నువ్వే.. ఉన్నది ఎవరో: స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు

ABOUT THE AUTHOR

...view details