తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతన్నకు చేయూత.. చేనేత వస్త్ర ప్రదర్శన - National Silk Expo Srinagar colony

నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ ఫో-2019 పేరిట గ్రామీణ హస్తకళా వికాస్‌ సమితి ఆధ్వర్యంలో శ్రీనగర్‌ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సినీ నటి సేజిల్​ ప్రారంభించారు.

నేతన్నకు చేయూత.. చేనేత వస్త్ర ప్రదర్శన

By

Published : Nov 9, 2019, 11:30 PM IST

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నేషనల్ సిల్క్ ఎక్స్ ఫో -2019 పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను వర్థమాన సినీ నటి సేజిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శిస్తూ నటి సేజిల్‌ సందడి చేశారు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని సేజిల్‌ పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా చేనేత కార్మికులకు మరింత ప్రోత్సహిం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

రానున్న పండుగలు, వెడ్డింగ్‌ సీజన్‌ సందర్భంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ఈ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలో 14 నగరాలకు చెందిన చేనేత కళాకారులు, డిజైనర్లు రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు దాదాపు 80 స్టాళ్లలో కొలువుదీరిన.... ఈ ప్రదర్శన నవంబర్‌ 18 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.

నేతన్నకు చేయూత.. చేనేత వస్త్ర ప్రదర్శన

ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details