దేశహితం కోసం, పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపకల్పన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలోని అన్ని పార్టీల్లో కంటే అత్యధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నది ఒక్క భాజపాలో మాత్రమేనన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ పాలసీ, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం, విద్యా అభివృద్ధిపై జాతీయ సెమినార్ నిర్వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె.లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మోత్కుపల్లి నరసింహులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
'రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు' - రిజర్వేషన్ పాలసీ, అట్రాసిటీ చట్టంపై కె. లక్ష్మణ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ పాలసీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, విద్యా అభివృద్ధిపై జాతీయ సెమినార్ నిర్వహించారు.

'పటిష్ఠమైన అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత భాజపాదే'
రాష్ట్రంలో స్వేచ్ఛలేదని.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికమన్నారు. నిజాం పరిపాలనను తలపించేలా కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నాడని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాక కేసీఆర్ నియంత పాలనను ఎదుర్కొనేందుకు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు భాజపాలో చేరానని మోత్కుపల్లి స్పష్టం చేశారు.
'రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు'
ఇదీ చూడండి: 'ఎవరేం చేసినా పౌర చట్టంపై వెనకడుగు ప్రసక్తే లేదు'
Last Updated : Jan 22, 2020, 12:06 AM IST