వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని... సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మెట్టుగూడ చౌరస్తా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, గంటకు 40కి.మీల కంటే మించి వేగంగా వెళ్లకూడదని సూచించారు.
'వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి' - హైదరాబాద్ తాజా వార్తలు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని... గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
!['వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి' national road safety celebrations in Secunderabad traffic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10314256-864-10314256-1611147318657.jpg)
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి
కార్లు నడిపేవారు సీటు బెల్టు తప్పక ధరించాలని చెప్పారు. జీబ్రా క్రాసింగ్‌ను ఎవరూ దాట వద్దని, దానివల్ల పాదచారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. మహంకాళి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమం నెల రోజుల పాటు సాగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో ద్విచక్ర వాహనానికి నిప్పు