తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి థర్మల్​ విద్యుత్​ కేంద్రానికి జాతీయ స్థాయి రికార్డు

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి రికార్డు స్థాయి పీఎల్ఎఫ్ సాధించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 87.53 శాతం పీఎల్ఎఫ్ తో జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది.

national record for telangana Singareni thermal power station
సింగరేణి థర్మల్​ విద్యుత్​ కేంద్రానికి జాతీయ స్థాయి రికార్డు

By

Published : Apr 16, 2020, 6:56 PM IST

మంచిర్యాల జిల్లా జైపూర్​లోని 1200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 87.53 శాతం పీఎల్ఎఫ్​తో జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి ప్రారంభించిన మూడున్నరేళ్ల నుంచి రికార్డు స్థాయి పీఎల్ఎఫ్ సాధిస్తోంది. 2017-18లో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచిన జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. 2018-19లో రెండు సార్లు నూరుకు పైగా పీఎల్ఎఫ్ సాధించింది.

గత ఆర్థిక సంవత్సరంలో 9 వేల 227 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. అందులో 8 వేల 672 మిలియన్ యూనిట్లను రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం గజ్వేల్ లోని గ్రిడ్ కు సరఫరా చేసింది.

జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మార్చి 2020 వరకు 31 వేల750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది.

అందులో 29 వేల 833 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను రాష్ట్ర అవసరాలకు అందించినట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరుస్తూ మరింత మెరుగైన పనితీరుతో ముందుకు సాగాలని ప్లాంట్ అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details