Naravaripalli getting ready for Sankranti: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరిలోని నారావారిపల్లి సంక్రాంతి శోభను ముందే సంతరించుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లికి మూడు సంవత్సరాల తర్వాత రానుండడంతో పల్లెలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి సున్నాలు, ఇంటి ముందు రంగువల్లులుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
చంద్రబాబు రాక కోసం.. ముస్తాబు అవుతున్న నారావారి పల్లె! - tirupati news
Naravaripalli getting ready for Sankranti: మూడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఏపీలోని నారావారిపల్లికి వస్తున్నారు. ఈ తరుణంలో చంద్రగిరి టీడీపీ బాధ్యుడు పులివర్తి నాని.. మండల నాయకులతో కలిసి పనులను పర్యవేక్షించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా రానున్న నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు చంద్రగిరి టీడీపీ బాధ్యుడు పులివర్తి నాని తెలిపారు. చంద్రబాబు కుటుంబం పర్యటించే ప్రాంతాల్లోని పనులను చక్కదిద్దే బాధ్యతలను మండల నాయకులకు అప్పగించారు. ఈ నెల 12వ తేది నుంచి నందమూరి, నారా వారి కుటుంబీకులు నారావారిపల్లెకు రానున్నారు.
ఇవీ చదవండి: