తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ మెడికల్ సీట్ల​ ఫీజు తగ్గించాలి: జస్టిస్ ఈశ్వరయ్య - PG Medical seats Latest news

తెలంగాణ పీజీ మెడికల్​ కళాశాలలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. సీట్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

national-president-of-all-india-bc-federation-president-justice-eshwariah-demands-pg-medical-fees-should-be-reduced-in-telangana-state
పీజీ మెడికల్​ ఫీజులను తగ్గించాలి: జస్టిస్ ఈశ్వరయ్య

By

Published : Jun 2, 2020, 10:41 PM IST

తెలంగాణ పీజీ మెడికల్ కళాశాలలో సీట్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. ఓపెన్ కేటగిరీ, మైనార్టీ అభ్యర్థుల వల్ల బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఫీజుల నియత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పేద విద్యార్థులు లక్షలో ఫీజులు కట్టలేరని తెలిపారు.

మరో వైపు మెడికల్ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తక్షణమే కౌన్సిలింగ్ నిలిపివేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీట్ల విషయంలో విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details