తెలంగాణ

telangana

ETV Bharat / state

Dikshant Parade: 6న దీక్షాంత్ పరేడ్‌.. చీఫ్ గెస్ట్ ఎవరంటే? - తెలంగాణ వార్తలు

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులకు ఎల్లుండి దీక్షాంత్ సమారోహ్‌ నిర్వహించనున్నట్లు జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌ తెలిపారు. ముఖ్య అతిథిగా హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ హాజరవుతారని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Dikshant Parade to ips, national police academy director press meet
హైదరాబాద్‌లో దీక్షాంత్ పరేడ్, ఐపీఎస్ అధికారుల పరేడ్‌పై జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ మీడియా సమావేశం

By

Published : Aug 4, 2021, 1:21 PM IST

Updated : Aug 4, 2021, 2:19 PM IST

జాతీయ పోలీస్ అకాడమీలో ఈ నెల 6న జరగనున్న దీక్షాంత్ సమారోహ్‌లో జరగనుందని ఎన్పీఏ సంచాలకులు అతుల్ కార్వల్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మొత్తం 178 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది విదేశీ అధికారులు ఉన్నారని వివరించారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌ల దీక్షాంత్ పరేడ్‌పై హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ బ్యాచ్‌లో 33 మంది మహిళలుండగా.. అందులో 23 మంది ఐపీఎస్‌లు దేశానికి చెందిన వాళ్లని... మిగతా 10 మంది మహిళలు నేపాల్, భూటాన్, మాల్దీవ్, మారిషస్‌కు చెందిన వాళ్లున్నారని తెలిపారు. 72 వ బ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన రంజిత్ శర్మకు ప్రధాని బ్యాటన్‌తో పాటు... హోంమంత్రి రివాల్వర్‌ను బహుకరించనున్నారని పేర్కొన్నారు. దీక్షాంత్ సమారోహ్‌కు రంజిత్ శర్మ నేతృత్వం వహించనున్నారని... తెలంగాణకు నలుగురు ఐపీఎస్‌లను కేటాయించినట్లు వివరించారు.

ప్రొబేషనరీ శిక్షణ పూర్తి చేసుకున్న71, 72వ బ్యాచ్‌లోని ఐపీఎస్‌లకి ఆగస్టు 6వ తేదీన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో 144 మంది శిక్షణ పూర్తి చేసుకుని దేశానికి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాలుగు దేశాలకు చెందిన 34 మంది విదేశీ అధికారులు కూడా శిక్షణ పొందారు. వీరంతా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొంటారు.

అతుల్‌ కార్వల్‌, జాతీయ పోలీస్‌ అకడామీ డైరెక్టర్‌

ఎల్లుండి దీక్షాంత్ పరేడ్‌

ఇదీ చదవండి:KTR: మోనిన్ పెట్టుబడులు రెట్టింపు... మంత్రి కేటీఆర్ హర్షం

Last Updated : Aug 4, 2021, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details