తెలంగాణ

telangana

ETV Bharat / state

షాదీముబారక్​ దేశమంతటికీ ఆదర్శం... అభినందించిన రషీద్​ - తెలంగాణ వార్తలు

జాతీయ మైనార్టీ కమిషన్​ ఉపాధ్యక్షుడు అతీఫ్​ రషీద్​ హైదరాబాద్​లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించారు.

షాదీముబారక్​ దేశమంతటికీ ఆదర్శం... అభినందించిన రషీద్​
షాదీముబారక్​ దేశమంతటికీ ఆదర్శం... అభినందించిన రషీద్​

By

Published : Jan 29, 2021, 8:02 PM IST

దేశమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్న షాదీముబారక్ లాంటి వినూత్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని జాతీయ మైనార్టీ కమిషన్ ఉపాధ్యక్షుడు అతీఫ్ రషీద్ అభినందించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై మైనార్టీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మైనార్టీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. షాదీముబారక్, విదేశీ ఉపకారవేతనాలు, మైనార్టీ గురుకులాల గురించి తెలిపారు. మైనార్టీ గురుకులాలను విజయవంతంగా నడిపిస్తున్నారని అభినందించిన రషీద్... క్రైస్తవుల కోసం శ్మశానవాటికల నిర్మాణం, ఆర్థికసాయం, క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వడం బాగుందని అన్నారు.

ఇదీ చదవండి: పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details