ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా మారిందని జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్ రషీద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో హోంమంత్రి మహమూద్ అలీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో ముస్లింల కోసం ప్రారంభించిన విద్యా, సంక్షేమ పథకాలు ఆర్చర్యాన్ని కలిగించాయని రషీద్ పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక పర్యటనలో ఉన్న రషీద్.. రాష్ట్రంలోని వివిధ విభాగాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే మహమూద్ అలీని కలిశారు.