తెలంగాణ

telangana

ETV Bharat / state

'రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాలు' - Somajiguda press Club Round Table Meeting

రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

manda Krishna
manda Krishna

By

Published : Mar 5, 2020, 9:25 PM IST

దేశవ్యాప్తంగా ప్రస్తుతం రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడిందని ఎమ్మార్పీఎస్​​ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు దేశంలోని అన్ని పార్టీల నాయకులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. భాగ్యనగరం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్లు పరిరక్షించుకోక పోతే... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దూ అంటూనే... అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని అడిగారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భాజపా మినహా మిగతా పార్టీలన్నింటితో కలిసి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

'రిజర్వేషన్ల పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాలు'

ఇదీ చూడండి :'ఐఎఫ్​ఎస్'​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం

ABOUT THE AUTHOR

...view details