తెలంగాణ

telangana

ETV Bharat / state

'చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది' - Hyderabad latest news

చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని... మూసాపేట్‌ కార్పొరేటర్‌ మహేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ మోతీనగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ హ్యాండ్‌ క్రాఫ్ట్‌‌ మేళాను ఆయన ప్రారంభించారు.

National Level Handlooms and Handicrafts Fair in Hyderabad
'చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది'

By

Published : Feb 23, 2021, 7:45 PM IST

రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని... మూసాపేట్‌ కార్పొరేటర్‌ మహేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ హ్యాండ్‌ క్రాఫ్ట్‌ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పలువురు పాల్గొని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.

కరోనా కారణంగా చేతి వృత్తి కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని... మేళా నిర్వాహకుడు గంగాధర్​ అన్నారు. వారికి ఉపాధితో పాటు ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కళాకారులు తయారు చేసిన పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి: బయో ఆసియా సదస్సు విజయవంతం: జయేశ్ ​రంజన్

ABOUT THE AUTHOR

...view details