తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ మహేందర్​ రెడ్డికి ఎన్​హెచ్​ఆర్​సీ సమన్లు

పోలీసు అధికారుల వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించనందుకు తమ ఎదుట హాజరు కావాలని డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రత్యక్షంగా హాజరై రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

national human right commission served notice to dgp mahender reddy
డీజీపీ మహేందర్​ రెడ్డికి ఎన్​హెచ్​ఆర్​సీ సమన్లు

By

Published : Oct 3, 2020, 4:12 AM IST

రాష్ట్రంలో పోలీసు అధికారుల వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించనందుకు డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రత్యక్షంగా హాజరై రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 22న కరీంనగర్ నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా ముజీబ్ అనే వ్యక్తిని ఉద్దేశించి కరీంనగర్ ఎసీపీ అశోక్​తో పాటు అక్కడి ఎస్​బీ ఇన్పెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ముజీబ్ కమిషన్​ కు ఫిర్యాదు చేశారు.

కేసును గత జనవరి 22న పరిగణలో తీసుకన్న కమిషన్.. ఆ వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని డీజీపీని గతంలోనే ఆదేశించింది. మే 12 లోపు రిక్విసైట్ రిపోర్ట్ అందకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది.

ఇదీ చదవండి:ఉత్కంఠభరిత మ్యాచ్​లో వార్నర్​సేన విజయం

ABOUT THE AUTHOR

...view details