భారీ వర్షంతో జాతీయ రహదారులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. వర్షానికి వచ్చిన వరదలతో వందల సంఖ్యలో వాహనాలు నీటమునిగాయి.. కొట్టుకుపోయాయి. వరదప్రవహంతో హైదరాబాద్-బెంగళూరు మార్గంలోని గగన్ పహాడ్ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేశారు.
భారీ వర్షానికి జాతీయ రహదారులు అస్తవ్యస్తం - Damaged national highways in Telangana
ఊహకందనంత వర్షం కురవడంతో జాతీయ రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ రహదారులపై పలు ప్రాంతాల్లో చాలాచోట్ల నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది.
భారీ వర్షానికి జాతీయ రహదారులు అస్తవ్యస్తం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద అప్రోచ్ రోడ్డుపై వంతెన మరమ్మతులు చేస్తుండగా పూర్తిగా కూలిపోయింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మూడు ప్రాంతాల్లో రోడ్డు బాగా దెబ్బతింది. నల్ల చెరువు వద్ద కిలోమీటరుకు పైగా రోడ్డు కొట్టుకుపోయింది. జీడిమెట్ల సమీపంలో ఉన్న చెరువు నీరంతా రహదారిపై పొంగిపొర్లుతుందని రహదారుల సంస్థ అధికారులు తెలిపారు.