రాష్ట్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. సరైన నిర్వహణ లేకపోవడం దానికి తోడు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారాయి. రాష్ట్రంలో 23 జాతీయ రహదారులు 3,824 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 1,551 కిలోమీటర్లు.. మిగిలిన 2 వేల 273 కిలోమీటర్లు భారత జాతీయ రహదారుల సంస్థ కిందకు వస్తాయి. ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్న రహదారులు సుమారు 435 కిలోమీటర్ల మేర చాలా దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ అధికారులు తేల్చారు.
అంతటా ఇదే పరిస్థితి
జగిత్యాల-కరీంనగర్, వరంగల్-ఖమ్మం మార్గాల్లో సుమారు 250 కిలోమీటర్లు విస్తరించి ఉన్న రహదారుల్లో సుమారు 100 కిలోమీటర్ల మేరు రహదారులు చెడిపోయాయి. ఖమ్మం-అశ్వారావుపేట, గజ్వేల్-జగ్‌దేవ్‌పూర్ రూట్‌లో సుమారు 120 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న రహదారుల్లో సుమారు 70 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వరంగల్ జాతీయ రహదారికి సంబంధించి నగరంలో ఎక్కువ శాతం రోడ్లు దెబ్బతిన్నాయి. హైదరాబాద్-మన్నెగూడ రహదారిలో సుమారు 45 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
అరచేతిలో ప్రాణాలు...