చేనేత కార్మికుల ఆత్మహత్యలకు తెరాస ప్రభుత్వ అసమర్థతే కారణమని జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాకు దిగింది. జీవనం సాగించలేక ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులు కుటుంబాలతో దీక్ష చేశారు.
చేనేత కార్మికుల దీక్షకు వామపక్షాల మద్దతు - ఇందిరాపార్కులో చేనేత కార్మికుల దీక్ష
చేనేతకు పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్ దాసు సురేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెజాస అధ్యక్షుడు కోదండరాం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని నేతన్న ఐక్య కార్యచరణ కమిటీ ఛైర్మన్ దాసు సురేశ్ ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్న కుటుంబాలకు 10 లక్షల రూపాయాలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు.
ఇవీ చూడండి:పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు