చేనేత వస్త్రాలు ధరించడం వల్ల దేశంలో కొన్ని కోట్ల చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన వారమవుతమని గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించిన వాళ్లమవుతామని వెల్లడించారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హయత్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శైలజ హాజరై మహాత్ముడు దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
చేనేత దినోత్సవంలో 150 మంది బుల్లి గాంధీలు
హైదరాబాద్ హయత్నగర్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణలతో చేనేత వస్త్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 250 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
చేనేత... భారతీయతకు ఆత్మ వంటిది