NGT orders to CS: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో ఎన్జీటీ ఆదేశాలు పట్టించుకోలేదని హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వుల తర్వాత కూడా నిర్మాణ పనులు చేపట్టారన్న ఏపీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చెన్నై బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిపివేయడం సాధ్యం కాకపోవడంతోనే ఆలస్యమయిందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని ఎన్జీటీకి వివరించింది.
NGT orders to CS: క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌కు ఎన్జీటీ ఆదేశం
21:28 February 25
NGT orders to CS: క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌కు ఎన్జీటీ ఆదేశం
అనుమతులు లేకుండా ఎలా చేపడతారు?
ముందస్తు అనుమతులు లేకుండా పనులు ఎలా చేపడతారని ఎన్జీటీ ప్రశ్నించింది. నిర్మాణ పనులు చేపట్టినట్లు స్పష్టం చేయకపోవడంపై ఎన్జీటీ అభ్యంతరం తెలిపింది. ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు అఫిడవిట్‌లో కనీసం క్షమాపణ కూడా కోరలేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ 80 శాతం పనులు పూర్తయిన తర్వాత పనులు నిలిపివేశారని ఏజీ వివరించారు. వాదనల సందర్భంగా బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేస్తున్నట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది.
ఇదీ చూడండి: