జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవగాహన నడక నిర్వహించారు. ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వరకు సాగిన ఈ నడకలో... ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు , మిషన్ ఛైర్మన్ ఈ. శ్రీనివాసచారి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్ రామేశ్వర్రావు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు కోరారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంపై 'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్' పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్' - save life
విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు తెలిపారు. జాతీయ పొదుపు వారోత్సవాల్లో భాగంగా నెక్లెస్‌రోడ్‌లో అవగాహన నడక నిర్వహించారు.

'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'
'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'
ఇవీ చూడండి: 'సోలార్ విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి'