National Energy Conservation Awards 2023 : దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను కైవసం చేసుకుంది. న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు.
ఇంధన సంరక్షణ, అందుబాటులో ఉన్న శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అద్భుతమైన పని తీరును కనబరిచిన వివిధ పారిశ్రామిక యూనిట్లు, స్థాపనలు, సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను అందజేస్తున్నారు.
శరవేగంగా ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్‌ట్రైన్ ప్రాజెక్ట్ పనులు- కీలక మైలురాయన్న రైల్వే మంత్రి
President Droupadi Murmu Presented The Awards : ఇంధన సంరక్షణలో దక్షిణ మధ్య రైల్వే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ఈ అవార్డులను వరుసగా గెలుచుకుంటుంది. దిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు, విజయవాడ డివిజన్‌కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ.పాటిల్ విజయవాడలోని వ్యాగన్ డిపోకు మొదటి బహుమతిని, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి.డి మిశ్రా, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ హైదరాబాద్ పీఆర్‌ఎస్ బిల్డింగ్‌కు మొదటి బహుమతిని అందుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఇతర సీనియర్ అధికారులు సంబందిత ఇంధన సామర్థ్య యూనిట్లకు సంబంధించిన అవార్డులు అందుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం సాధించిన జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు :
1. ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో హైదరాబాద్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పి.ఆర్.ఎస్) భవనం ప్రథమ బహుమతి సాధించింది.
2. రైల్వే వర్క్ షాప్ విభాగంలో విజయవాడలోని వ్యాగన్ డిపో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది.