తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన, రాష్ట్రం నుంచి ముగ్గురికి - national teacher awards 2022

national best teacher awards 2022 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ విభాగం ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అవార్డులకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన, రాష్ట్రం నుంచి ముగ్గురికి
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన, రాష్ట్రం నుంచి ముగ్గురికి

By

Published : Aug 25, 2022, 7:56 PM IST

national best teacher awards 2022: రాష్ట్రానికి చెందిన ముగ్గురికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ విభాగం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 46 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.ఎన్.శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన టి.ఎన్.శ్రీధర్

సీబీఎస్ఈ కేటగిరీలో హైదరాబాద్ నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న దిల్లీ విజ్ఞాన్ భవన్​లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details