తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు: ఆర్​.కృష్ణయ్య - బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న కృష్ణయ్య

56 శాతం ఉన్న వెనకబడిన కులాల వారికి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య అన్నారు. అన్ని రంగాల్లో బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో తెలంగాణ పాఠ్యపుస్తక ముద్రణాలయ అధికారుల, ఉద్యోగ, కార్మిక బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

National bc welfare president r.krishnaiah demands for bc reservations in politics in khairathabad in hyderabad
బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య

By

Published : Feb 15, 2021, 4:26 PM IST

దేశంలో 70కోట్ల మంది బీసీల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య ఆరోపించారు. అన్ని వర్గాల నుంచి ముఖ్యమంత్రులు అయినా బీసీలకు మాత్రం ఒక్కరికి కూడా ఆ పదవి దక్కలేదని అన్నారు. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో తెలంగాణ పాఠ్యపుస్తక ముద్రణాలయ అధికారుల, ఉద్యోగ, కార్మిక బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఉద్యోగాలలో వాటా కోసం, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. మన ఓట్లతో గద్దెనెక్కుతున్న అగ్రవర్ణాల పాలకులు బీసీల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఓటు హక్కును విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. రైల్వే ఫ్లాట్​ఫామ్​పై ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానిగా, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారంటే అది కేవలం ఓటు అనే ఆయుధంతోనే అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సంఘాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. క్రిమిలేయర్ తొలగించి బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు పెట్టాలని ఆర్​.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :పాలనా సౌలభ్యం కోసమే నూతన పంచాయతీలు : ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details