రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ... అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ సెప్టెంబర్ 14న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఎన్డీఏ సర్కార్ కేంద్ర విద్యుత్ సంస్కరణల బిల్లులను రద్దు చేయాలని సమన్వయ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను చట్టబద్ద హక్కుగా చేయాలన్నారు. ఇందుకు నూతన చట్టాన్ని రూపొందించాలని కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా..
14న తలపెట్టిన అందోళన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్లు కన్వీనర్లు పేర్కొన్నారు.
బిల్లుల ప్రతులను తగలబెట్టడమే..