ప్రభుత్వ ఐటీ విభాగానికి నాస్కామ్ కృత్రిమ మేధ గేమ్ ఛేంజర్ అవార్డు - telangana varthalu
19:14 August 06
ప్రభుత్వ ఐటీ విభాగానికి నాస్కామ్ కృత్రిమ మేధ గేమ్ ఛేంజర్ అవార్డు
తెలంగాణ ప్రభుత్వానికి నాస్కామ్ కృత్రిమ మేధ గేమ్ ఛేంజర్ అవార్డు లభించింది. నాస్కామ్ నిర్వహించిన 'ఎక్స్పీరియన్స్-ఏఐ' సదస్సులో ప్రభుత్వ ఐటీ విభాగం అవార్డును కైవసం చేసుకుంది. కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించినందుకు గాను ఈ అవార్డు లభించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన 'క్రౌడ్ మానిటరింగ్ యూజింగ్ ఐఏఏఐని ఉపయోగించి సమూహాన్ని పర్యవేక్షించటం ప్రాజెక్ట్‌కు ఏఐ గేమ్ ఛేంజర్ ఎక్సెంప్లర్ అవార్డు లభించింది.
మొత్తం 300 దరఖాస్తులు వస్తే... తెలంగాణ ఐటీ విభాగానికి అవార్డు దక్కింది. ఈ ప్రాజెక్టును అవిరోస్ అనే అంకురం అభివృద్ధి చేయగా... మేడారం జాతర, రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇండియా-వెస్టిండీస్ టీ-20మ్యాచ్ సందర్భంగా ఈ సాంకేతికతను ఉపయోగించారు.
ఇదీ చదవండి:CM KCR REVIEW: నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష