తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. కోటి నలభై లక్షలతో వెళ్లిన కొడుకు కనబడుటలేదు - కోకాపేట

నార్సింగి పోలీస్ స్టేషన్​లో కిడ్నాప్ కేసు నమోదైంది. అమెజాన్​ సంస్థలో పనిచేసే ప్రతీక్ ఈ నెల 29న కిడ్నాప్ అయ్యాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లేందుకు కోటి నలభై లక్షలు డిపాజిట్ చేసేందుకు డబ్బులు తీసుకున్నట్టు తెలిపాడు.

కోటి నలభై లక్షలతో వెళ్లిన కొడుకు కనబడుటలేదు

By

Published : Aug 1, 2019, 12:53 AM IST

హైదరాబాద్​ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్​లో కిడ్నాప్ కేసు నమోదైంది. అమెజాన్​ సంస్థలో పనిచేసే ప్రతీక్ పాండా ఈ నెల 29న అదృశ్యమయ్యాడనితండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోకాపేటలోని సెవెన్​హిల్స్ అపార్ట్​మెంట్ నుంచి కిడ్నాప్​కు గురైయ్యాడనీ పోలీసులకు తెలిపాడు.ఎంఎస్ కోసం అమెరికా వెళ్లేందుకు కోటి నలభై లక్షలు డిపాజిట్ చేయాలని డబ్బులు తల్లిదండ్రుల నుంచి తీసుకున్నట్టు వెల్లడించారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్​కు చెందిన ప్రతీక్ తండ్రి భగీరథ పాండా.. నార్త్ ఈస్టర్న్ నెహ్రు యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు. నార్సింగి పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోటి నలభై లక్షలతో వెళ్లిన కొడుకు కనబడుటలేదు

ఇదీ చూడండి : బీసీల సమస్యలపై ఆగస్టు 7న జాతీయ సదస్సు

ABOUT THE AUTHOR

...view details