తెలంగాణ

telangana

ETV Bharat / state

'నర్సారెడ్డితో దీక్ష విరమింపచేసిన ఉత్తమ్'

ముంపు ప్రాంతాల్లోని రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం సక్రమంగా అందకపోవడం శోచనీయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూ నిర్వాసితుల పరిహారం కోసం దీక్ష చేస్తోన్న నర్సారెడ్డికి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

By

Published : May 16, 2019, 8:57 PM IST

రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం సక్రమంగా అందకపోవడం శోచనీయం : ఉత్తమ్

తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ​రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో దీక్ష చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని పరామర్శించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. భూ నిర్వాసితులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించనందుకే కనకయ్య అనే రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని ఉత్తమ్​ అన్నారు. నర్సారెడ్డి కనకయ్యను పరామర్శించి..అండగా నిలిచినందుకే ప్రభుత్వం కక్ష కట్టిందని మండిపడ్డారు.
ముంపు ప్రాంతాల్లోని రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం సక్రమంగా అందకపోవడం శోచనీయమని ఉత్తమ్​ పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్​ పేర్కొన్నారు.

భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details