తెలంగాణ

telangana

ETV Bharat / state

PM Modi Warangal Tour Schedule : ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే

PM Narendra Modi Warangal Tour Schedule : ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్న మోదీ.. ఇక్కడి నుంచి వరంగల్‌ వెళ్లనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

modi
modi

By

Published : Jul 4, 2023, 12:53 PM IST

Updated : Jul 4, 2023, 1:17 PM IST

Modi Warangal Tour Schedule : ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 8న వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో 9.45 గంటలకు ప్రధాని హైదరాబాద్‌లోని హకీంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.50 నిమిషాలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. తర్వాత 10.35 గంటలకు వరంగల్‌లోని హెలిప్యాడ్‌కు మోదీ చేరుకోనున్నారు. అక్కడ ప్రధాని మోదీకి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఉదయం 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. ఆ సభ నుంచి 12.15 గంటలకు వరంగల్‌ హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే..:

  • 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • 9:50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు పయనమవుతారు.
  • 10:35 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు.
  • 10:45 నుంచి 11:20 వరకు పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు.
  • 11:30 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు బహిరంగ సభకు హాజరవుతారు.
  • 12.15 గంటలకు వరంగల్ హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.
  • 1.10 గంటలకు హకీంపేట్‌ విమానాశ్రయం నుంచి రాజస్థాన్​ తిరుగు పయనమవుతారు.

కాజీ పేట వ్యాగన్‌ను సందర్శించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ : జులై 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌ పర్యటన సందర్భంగా.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితమే వరంగల్‌కు వెళ్లి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాజీపేట వ్యాగన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. మోదీ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని కాజీపేట వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దేశంలోని అతిపెద్ద వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేసి.. ఆ తర్వాత హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Modi Warangal Tour Schedule Final : దక్షిణాది రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బీజేపీకి మంచి పట్టు ఉన్న తెలంగాణలో వచ్చే నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగా కేంద్రమంత్రులు, బడానేతలతో పాటు అమిత్‌ షా, జేపీ నడ్డాలు కూడా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 4, 2023, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details