తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్‌తో విద్యార్థి మృతి కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు - Drug pedlar laxmipathy arrest news

Narcotics‌ DCP On Laxmipathi Arrest: అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని అనారోగ్యంతో మృతి చెందిన బీటెక్‌ విద్యార్థి కేసులో హైదరాబాద్‌లో పోలీసులు తీగ లాగితే.. ఏపీలో డొంక కదిలింది. బీటెక్ విద్యార్థికి హాష్ ఆయిల్ విక్రయించిన లక్ష్మీపతి సహా ఏపీకి చెందిన నగేశ్‌ అనే సరఫరాదారును, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. విశాఖకు చెందిన నగేశ్‌ వెయ్యి ఎకరాల్లో గంజాయి సరఫరా చేస్తున్నాడని... ఒడిశా, తమిళనాడు, దిల్లీ, ముంబయి ముఠాలతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

Narcotics‌ DCP
Narcotics‌ DCP

By

Published : Apr 6, 2022, 4:25 PM IST

Updated : Apr 6, 2022, 8:43 PM IST

'బీటెక్ విద్యార్థికి డ్రగ్స్ సరఫరా చేసింది లక్ష్మీపతి ముఠానే'

Narcotics‌ DCP On Laxmipathi Arrest: మాదక ద్రవ్యాలు అతిగా సేవించి అనారోగ్యంతో మృతి చెందిన హైదరాబాద్​ నల్లకుంట బీటెక్ విద్యార్థి మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు... మరో కీలక నిందితుడు నగేశ్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం అరెస్టైన లక్ష్మీపతికి.... నగేశ్‌ ఏపీ నుంచి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. విశాఖపట్నం అరకు సమీపంలోని లోగిలి గ్రామానికి చెందిన నగేశ్‌... సుమారు వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు చేస్తూ... దాని నుంచి హాష్ ఆయిల్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగేశ్‌ కుటుంబసభ్యులు, బంధుమిత్రులంతా ఇదే దందా సాగిస్తున్నారని వెల్లడించారు.

నగేశ్‌కు ఒడిశా, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబయి, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు.... గంజాయి, హాష్‌ ఆయిల్‌ సరఫరా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. నగేశ్‌తోపాటు మరో ఇద్దరు వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 840 గ్రాములు హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపతి బీటెక్‌ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్‌కు బానిసయ్యాడని... వినియోగదారుడిగా మొదలై ఆ తర్వాత పెడ్లర్‌గా మారాడని పోలీసులు వివరించారు. హాష్‌ ఆయిల్‌ను కిలో 50 వేలకు కొని... 6 లక్షలకు అమ్ముతున్నాడని నార్కోటిక్‌ విభాగం డీసీపీ చక్రవర్తి తెలిపారు.

'డ్రగ్స్‌ సరఫరాదారు లక్ష్మీపతి హాష్ ఆయిల్‌ విక్రయిస్తున్నాడు. 2016లో లక్ష్మీపతి 2 కేసుల్లో అరెస్టు అయ్యాడు. అతనిపై ఇప్పటివరకు 6 కేసులు ఉన్నాయి. గతంలో హాష్‌ ఆయిల్‌ కేసులో విశాఖలో లక్ష్మీపతి అరెస్టయ్యాడు. వంశీకృష్ణ, విక్రమ్‌ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించాం. నిందితుల వద్ద 840 గ్రాముల హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నాం. నిందితుల వద్ద రూ.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం. మదన్‌, రాజు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించాం. 5 గ్రాముల హాష్‌ ఆయిల్‌ విలువ రూ.3 వేలు, కిలో హాష్‌ ఆయిల్‌ విలువ రూ.6 లక్షలు ఉంటుంది. లక్ష్మీపతి వద్ద 18 మంది డ్రగ్స్‌ వినియోగాదారులు ఉన్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నాం. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. లక్ష్మీపతితో పాటు నగేశ్‌ కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. నగేశ్‌కు ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌ వినియోగదారులతో సంబంధాలు. ఒడిశా, తమిళనాడు, దిల్లీ, ముంబయి వినియోగదారులతో సంబంధాలున్నాయి.' -- చక్రవర్తి గుమ్మి, నార్కోటిక్స్‌ డీసీపీ

సులభంగా డబ్బు సంపాదించాలని మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న మరో ఇద్దరిని నార్గొటిక్ నియంత్రణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న మదన్, రాజులను పట్టుకున్నారు. వీరి దగ్గర హాష్‌ ఆయిల్‌ కొన్న 9మందిని కూడా అరెస్ట్ చేశారు. వినయోగదారుల్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులు, నిరుద్యోగులున్నారని పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:

Last Updated : Apr 6, 2022, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details