మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు డ్రైవర్ దస్తగిరి నిన్న హాజరయ్యారు. డ్రైవర్ దస్తగిరి అత్త మాబున్నీసాను సీబీఐ అధికారులు విచారించారు. మరోవైపు మంత్రి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్..విచారణ వచ్చే నెల 1కి వాయిదా వేసింది.
సమాచారమిస్తే రివార్డు..
వివేకా హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 21న పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్‌కు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.
ఇదీ చూడండి:Ys viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో ఈరోజు ఏం జరిగిందంటే..?