కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణ రాజు సూచించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై స్థానిక పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజుల్లోనే ఉత్సవాలు ముగించుకోవాలన్నారు.
'గణేశ్ మండపాల వద్ద తీర్థప్రసాదాల వితరణ చేయరాదు' - sangareddy news
సంగారెడ్డి నారాయణఖేడ్‌లో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై డీఎస్పీ సత్యనారాయణ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మూడు రోజులే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
!['గణేశ్ మండపాల వద్ద తీర్థప్రసాదాల వితరణ చేయరాదు' narayankhed dsp conducted meeting for ganesh festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8463744-587-8463744-1597744667311.jpg)
narayankhed dsp conducted meeting for ganesh festival
మూడు అడుగుల లోపు మట్టి విగ్రహం మాత్రమే ప్రతిష్ఠించుకోవాలన్నారు. వేడుకల్లో పెద్ద శబ్దాలు వచ్చే పరికాలు పెట్టొద్దని తెలిపారు. భక్తులు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ దర్శించుకోవాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఎలాంటి తీర్థప్రసాదాల వితరణ చేయరాదన్నారు. జనసమూహం ఉండేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సై సందీప్, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్థులు పాల్గొన్నారు.