తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది' - trs

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని... కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

భట్టి దీక్షపై స్పందించిన సీపీఐ నేత

By

Published : Jun 10, 2019, 1:45 PM IST

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడం అనైతికమైన చర్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మరో ప్రాంతీయ పార్టీ శాసనసభాపక్షంలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. సీఎల్పీ విలీనంపై నిరసనగా మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్క పట్ల ప్రభుత్వం దూకుడుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

భట్టి దీక్షపై స్పందించిన సీపీఐ నారాయణ

ABOUT THE AUTHOR

...view details