నారద జయంతి సందర్భంగా హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో సమాచార భారతి ఆధ్వర్యంలో పాత్రికేయ సన్మానసభ నిర్వహించారు. సమాచారాన్ని అందించడం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పోలీస్ శాఖ సలహాదారు చంగపల్లి వెంకట్ తెలిపారు. సమాచారం అందించే విధానంలోనూ మార్పులు తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ముఖేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈనాడు డిప్యూటీ న్యూస్ ఎడిటర్ రావికంటి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.
పాత్రికేయులను గుర్తించాల్సిన అవసరం ఉంది - reporters
హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో నారద జయంతి సందర్భంగా పాత్రికేయ సన్మానసభ నిర్వహించారు.
పాత్రికేయులను గుర్తించాల్సిన అవసరం ఉంది
ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు ఓంప్రకాశ్ నారాయణతో పాటు పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. పాత్రికేయ వృత్తిలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ సేవలందిస్తున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: అన్నీ సర్వేలు... అధికార తెరాస వైపే....