LOKESH YUVAGALAM PADAYATRA: ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతోందని రైతులు లోకేశ్ ఎదుట వాపోయారు. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగాయన్నారు. కిలోకు 15 రూపాయల ధర కూడా రావడం లేదన్నారు. వారి సమస్యలు విన్న లోకేశ్.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు.
పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఐదో రోజు ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణాపురం టోల్‌గేట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కస్తూరి నగరం క్రాస్ వద్ద గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్నారు. కైగల్లు వద్ద యాదవ సామాజికవర్గం, మధ్యాహ్నం దేవదొడ్డి గ్రామంలో కురుమ సామాజికవర్గంతో భేటీ అవుతారు. సాయంత్రం బైరెడ్డిపల్లెలో బీసీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొంటారు.
ఇవీ చదవండి: