Lokesh Serious On YCP Govt: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్జారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి జాగీరా అని లోకేశ్ ప్రశ్నించారు. ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పోలీసులు కుప్పంపై ఏకంగా అప్రకటిత యుద్ధమే ప్రకటించారని మండిపడ్డారు. బ్రిటీష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో ఇచ్చిన జగన్ రెడ్డి తెల్లారేసరికి ఉల్లంఘనలకు పాల్పడ్డారని చట్టం ఎదుగూరి సంధింటికి ఎదురింటి చుట్టమా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి జాగీరా: లోకేశ్ - Lokesh is angry at the behavior of the police
Lokesh Serious On YCP Govt: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబు కుప్పం పర్యటనపై లోకేశ్ స్పందించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్జారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి జాగీరా లేక రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు జగన్ ఆంక్షలేంటని నిలదీశారు. జగన్ తన కుతంత్రాలన్నీ కుప్పంలో ప్రయోగిస్తున్నాడని చంద్రబాబు ప్రచారరథం స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. కార్యకర్తల్ని కొట్టించడం, నాయకుల్ని నిర్బంధించడం వంటి ఎన్ని అరాచకాలకు పాల్పడినా చంద్రబాబుకు జనాదరణ ఇంకా పెరుగుతూనే ఉంటుందని.. జగన్‌పై ప్రజావ్యతిరేకత తగ్గదని ధ్వజమెత్తారు. 35 ఏళ్లుగా కుప్పం జగన్ లాంటి కుట్రదారులని ఎంతోమందిని చూసిందని తెలుగుదేశం కోట కుప్పంలో సీఎం కుప్పిగెంతులు చెల్లవని హెచ్చరించారు. పసుపు సైన్యం కదం తొక్కుతోందని జగన్ తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటన ఆపలేవని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: